News February 13, 2026

గజపతినగరం: హాస్టల్ రూములో విద్యార్థి ఆత్మహత్య..!

image

గజపతినగరంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి గురువారం రాత్రి మృతి చెందాడు. మెరకముడిదాం (M) ఊటపల్లి గ్రామానికి చెందిన రాజేశ్ నిన్న సాయంత్రం స్టడీ అవర్స్ అయిన వెంటనే తన గదిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి అపస్మారక స్థితిలో ఉన్న రాజేశ్‌ను సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే విద్యార్థి మెడపై ఉరివేసుకున్నట్లు ఉన్న ఆనవాలను పోలీసులు గుర్తించారు.

Similar News

News April 20, 2026

GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

image

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా

News April 20, 2026

మెదక్: ఎర్రవల్లి నుంచి జగిత్యాలకు KCR

image

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో జగిత్యాలకు బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్‌లో దిగిన అనంతరం నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరి ప్రజాసభలో పాల్గొననున్నారు.

News April 20, 2026

కడప రిమ్స్ వద్ద హత్య.. 11 మంది అరెస్ట్?

image

కడప రిమ్స్ వద్ద ఇటీవల దస్తగిరి అనే వ్యక్తిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మారెమ్మ జాతరలో జరిగిన చిన్న వివాదం హత్యకు దారితీసింది. వీరిని న్యాయమూర్తి ముందు హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కడప డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్సైలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.