News February 13, 2026
పాకిస్థాన్‌తో మ్యాచ్.. అభిషేక్ ఆడే ఛాన్సుందన్న వరుణ్

T20 WC: పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు అభిషేక్ శర్మ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిన్న మ్యాచ్ అనంతరం చెప్పారు. అభి బాగానే కనిపించాడని, ప్రాక్టీస్ కూడా చేశాడని తెలిపారు. మరోవైపు అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచులకు అందుబాటులో <<19122478>>ఉండకపోవచ్చని<<>> నిన్న మ్యాచుకు ముందు కెప్టెన్ సూర్య పేర్కొన్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. కాగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ తలపడనున్నాయి.
Similar News
News April 17, 2026
‘కాళేశ్వరం’పై ఎలాంటి దురుద్దేశమూ లేదు: మంత్రి

TG: ₹97,000CRతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకురావాలా అని ఆలోచనలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ‘కాళేశ్వరం నిర్మాణంలో BRS చేసిన తప్పిదాలు ప్రజలకు తెలుసు. ఈ ప్రాజెక్టుపై మాకెలాంటి దురుద్దేశమూ లేదు. గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్, డిజైన్లు పూర్తిచేయాలని నిర్ణయించాం’ అని వివరించారు. NDSA ఛైర్మన్‌తో వీటిపై చర్చించామని తెలిపారు.
News April 17, 2026
APPLY NOW: 350 బ్యాంక్ ఉద్యోగాలు

ఇండియన్ బ్యాంక్‌లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్, క్రెడిట్, రిస్క్, HRలో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి ఉద్యోగాలు దీనిలో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 28. బీటెక్, MCA, MBA, CA, ఏదైనా పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం https://indianbank.bank.in/career/ చూడండి.
News April 17, 2026
కాసేపట్లో మహిళా బిల్లుపై ఓటింగ్.. అందరూ మద్దతివ్వండి: మోదీ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంపీలందరూ మద్దతు ఇవ్వాలని PM మోదీ కోరారు. కాసేపట్లో ఓటింగ్ జరగనుందని, ఓటు వేసే ముందు ప్రతి సభ్యుడూ వారి తల్లి, సోదరి, భార్య, కూతురును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. మహిళలను గౌరవించడానికి ఇదొక గొప్ప అవకాశమని ట్వీట్ చేశారు. ఈ సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా దేశంలోని మహిళా శక్తి, ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.


