News May 1, 2024

లైట్ బీర్ల కోసం పోరాటం ఫలించింది

image

TG: లైట్ బీర్ల కోసం మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా ఎక్సైజ్ అధికారులకు రాసిన <<13146704>>లేఖ<<>> సర్వత్రా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై అధికారులు స్పందించారు. సంబంధిత బీర్లను షాపుల్లో అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో అధికారుల స్పందనపై తాగుబోతుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. లేఖ రాసిన వ్యక్తిని సత్కరించింది.

Similar News

News March 31, 2026

మలయాళంలోకి అనుష్క ఎంట్రీ.. ఇవాళే ట్రైలర్

image

హీరోయిన్ అనుష్క శెట్టి మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన ‘కథనార్’ ట్రైలర్ ఇవాళ మ.1.31 గంటలకు రిలీజ్ కానుంది. ఈ ఫాంటసీ థ్రిల్లర్‌లో జయసూర్య లీడ్ రోల్‌ చేస్తుండగా ప్రభుదేవా కీలకపాత్ర పోషిస్తున్నారు. 9వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మతగురువు కడమట్టతు కథనార్ జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ రోజిన్ థామస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

News March 31, 2026

లాస్ట్ సీజన్ రన్నరప్.. పంజాబ్ ఈసారైనా కప్పు కొడుతుందా?

image

IPL: గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈరోజు ఈ సీజన్ తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు ఆరు సార్లు తలపడగా చెరో మూడుసార్లు గెలిచాయి. గత సీజన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా శ్రేయస్, గుజరాత్ కెప్టెన్‌గా గిల్ కూడా రాణించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్‌లో బోణీ ఎవరు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. చండీగఢ్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

News March 31, 2026

యుద్ధం ముంచేసింది.. మార్చిలో ₹51లక్షల కోట్లు ఆవిరి

image

మార్చి నెల దేశీయ స్టాక్ మార్కెట్లకు ఓ పీడ కలగా మిగిలిపోయింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఈనెలలో సెన్సెక్స్ 9,340 పాయింట్లు (11.5%).. నిఫ్టీ 2850 పాయింట్లు (11.3%) క్షీణించాయి. ₹51లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత 2 రోజుల్లోనే ₹18.60లక్షల కోట్ల నష్టం వచ్చింది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ సంపద ₹46వేలకోట్లకుపైన తగ్గింది. కాగా ఈరోజు మహావీర్ జయంతి కారణంగా మార్కెట్లకు సెలవు.