News February 13, 2026

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: వరంగల్ పోలీసులు

image

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించవద్దని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజేతలు తమ సంబరాల కోసం మరో రోజును కేటాయించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News April 17, 2026

జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

image

YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాలు యూరప్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కావాలంది. పర్యటన వివరాలు కోర్టు, CBIకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

News April 17, 2026

కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారు: మిథున్ రెడ్డి

image

లోక్‌సభలో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా YCP MP మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. నలుగురు కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ పట్టుబడ్డారు. అసభ్యకరమైన వీడియోలు బయటపడ్డాయి. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసిన మహిళలనే టార్గెట్ చేసి వేధిస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.

News April 17, 2026

SRPT: రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవాలి: సౌమ్య మిశ్రా

image

రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలందరూ చైతన్యం కలిగి ఉండాలని రాష్ట్ర జైలు శాఖ డీఐజీ సౌమ్య మిశ్రా అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.