News February 13, 2026
బాపట్ల: శివరాత్రి వేళ భక్తులతో కిటకిటలాడే దేవాలయాలివే

ఈనెల 15 మహాశివరాత్రి సందర్భంగా బాపట్ల జిల్లాలోని పలు శివాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. అమృతలూరు మండలం గోవాడ గ్రామం, రేపల్లె మండలం అడవిపల్లిలోని బాలకోటేశ్వర స్వామి దేవాలయం, చిన్నగంజాం మండలం సోపిరాల గ్రామ శివాలయం, చిన్నగంజాం బాలకోటేశ్వర స్వామి ఆలయం, చుండూరు మండలం బాలకోటేశ్వర స్వామి దేవాలయం, కొల్లూరు మండలం కోటిపల్లి శివాలయాలకు శివరాత్రి రోజున వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.
Similar News
News April 18, 2026
WGL: ‘ఓపెన్’ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఓపెన్ టెన్త్‌లో 3,945 మంది విద్యార్థులకు 22 పరీక్ష కేంద్రాలు, ఇంటర్‌లో 7,187 మందికి విద్యార్థులు ఉండగా 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
News April 18, 2026
HYD పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA షకీల్ కొడుకు

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందింది. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.
News April 18, 2026
ట్రంప్‌కు పంచ్.. హార్ముజ్‌పై బాంబు పేల్చిన ఇరాన్

హార్ముజ్‌ను తెరవడంపై ఇరాన్ మెలిక పెట్టింది. జలసంధిని US దిగ్బంధిస్తే తాము మళ్లీ మూసివేస్తామని ఇరాన్ నేత గాలిబాఫ్ ప్రకటించారు. ప్రయాణించే నౌకలు తమ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. హార్ముజ్ తెరవడమా, మాసివేయడమా అనేది క్షేత్రస్థాయిలో నిర్ణయిస్తామని, SMలో కాదంటూ ట్రంప్‌పై సెటైర్ వేశారు. అబద్ధాలు చెప్పి ఆయన యుద్ధంలో గెలవలేరని, ఇలా మాట్లాడితే శాంతి చర్చల్లోనూ ఏమీ సాధించలేరని చురకలంటించారు.


