News February 13, 2026
BIG BREAKING: నల్గొండ: తొలి మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్‌దే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. నాగార్జునసాగర్ పరిధి నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 1 వార్డు BRS గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Similar News
News February 15, 2026
కర్నూలుకు అన్యాయం

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కర్నూలు జిల్లాకు మళ్లీ మొండి చెయ్యి చూపారని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి ఆరోపించారు. రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేవన్నారు. కేవలం మరమ్మతుల కోసం రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలకు నిధులు లేకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు.
News February 15, 2026
నాటి మణిగిరి.. నేటి మెట్టుగుట్ట

శివకేశవుల మధ్య భేదం లేదని చాటే అద్వైతమతానికి ప్రత్యక్ష నిలయం మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం. కాజీపేట రైల్వే స్టేషన్‌కు 2 కి.మీ దూరంలో మడికొండ గ్రామ సమీపంలోని గుట్టపైన ఈ ఆలయం ఉంది. మెట్టుగుట్టగా ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రాన్ని కాకతీయ రాజులు నిర్మించారు. మొదట చాళుక్య రాజులు వీరభద్ర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
News February 15, 2026
ప్రమాణస్వీకారానికి రండి.. మోదీకి బంగ్లా ఆహ్వానం!

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఈ నెల 17న కొలువుదీరనుంది. ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. మరో 12 దేశాలకు ఇన్విటేషన్ పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అతికొద్ది మందిని క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారని, తర్వాత విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎన్నికల్లో 297 స్థానాలకు గాను 209 చోట్ల BNP గెలిచింది.


