News February 13, 2026
బాన్సువాడలో బీజేపీ బోణీ

బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదైంది. 16వ వార్డులో బీజేపీ అభ్యర్థి గజ్జల మహేశ్.. కాంగ్రెస్ అభ్యర్థిపై 10 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మిగిలిన వార్డుల ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
Similar News
News April 16, 2026
కేంద్రం రాజ్యాంగాన్ని హైజాక్ చేస్తోంది: కాంగ్రెస్

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని హైజాక్ చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశ పెడుతున్న తీరుపై ఆ పార్టీనేత కేసీ వేణుగోపాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం మద్దతు ఇచ్చాం. 2024లో మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదు’ అని ప్రశ్నించారు. అయితే బిల్లు ప్రవేశపెట్టకుండానే ఎలా చర్చ చేపడతారని హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు.
News April 16, 2026
కరివేపాకు మొక్కలు గుబురుగా పెరగాలంటే?

కరివేపాకు మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగాక మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. మూడేళ్లు వచ్చిన కరివేపాకు చిన్న కొమ్మలను మొక్క మొదలు వరకు తుంచి, 4 లేదా 5 శాఖలు ఉండేలా ఉంచితే ఎక్కువ దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అలాగే పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులను మొక్కలకు వేస్తూ ఉండాలి.
News April 16, 2026
ఆ విమానాల్లో స్లీపర్ సీట్లు!

బస్సులు, రైళ్లలో ఉన్న స్లీపర్ బెడ్లు ఇకపై ‘ఎయిర్ న్యూజిలాండ్’ విమాన సర్వీసుల్లో కన్పించనున్నాయి. 17గంటల పాటు సాగే ప్రయాణాల్లో స్కైనెస్ట్ పాడ్స్ పేరుతో ఈ సదుపాయం కల్పించనున్నారు. వచ్చే నవంబర్ నుంచి న్యూయార్క్-ఆక్లాండ్ సర్వీసుల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. ఇందులో ఒకేసారి ఆరుగురు నిద్రపోయే అవకాశం ఉంటుంది. 4 గంటల తర్వాత మిగతా ప్రయాణికులు ఉపయోగించుకుంటారు. ఇందుకోసం ముందుగానే ఈ సర్వీసును ఎంచుకోవాలి.


