News February 13, 2026

మహబూబాబాద్‌లో సీపీఐ బోణి

image

మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను అధికారులు వెల్లడిస్తున్నారు. మున్సిపాలిటీలోని 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సీపీఐకి చెందిన అజయ్ సారథి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వేముల సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి నరసింహారావుపై అజయ్ సారథి 33 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Similar News

News April 15, 2026

NZB: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన వర్సిటీ ఉపకులపతి

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల 8వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరి రావు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ టి. సంపత్‌తో కలిసి కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.

News April 15, 2026

నేడు నిజామాబాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక

image

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మంత్రి నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:45 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు పయనవుతారు.

News April 15, 2026

ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థికి జిల్లా ఫస్ట్

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.