News May 1, 2024

ఆ స్థానంలో ఎన్నిక వాయిదా

image

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 25న నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారమైతే మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 7న అక్కడ ఎలక్షన్స్ జరగాలి. అయితే స్థానికంగా హిమపాతంతో ఎన్నికకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

Similar News

News March 16, 2026

HYDలోకి డీజిల్ బస్సులకు నో ఎంట్రీ!

image

TG: హైదరాబాద్‌ను పర్యావరణహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సిటీలోకి జిల్లాల నుంచి డీజిల్ బస్సులు రాకుండా కట్టడి చేయనుంది. ORR చుట్టూ ఆర్టీసీ టెర్మినళ్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణికులను నగరంలోకి చేరవేయనుంది. HYDలోని డీజిల్ బస్సులనూ జిల్లాలకు తరలించి ఇక్కడ కేవలం ఎలక్ట్రిక్ బస్సులే వాడతామని ఇటీవల సీఎం <<19328203>>రేవంత్<<>> చెప్పిన విషయం తెలిసిందే.

News March 16, 2026

ఇండక్షన్ స్టవ్స్ వాడుతున్నారా?

image

గ్యాస్ కొరతతో ఇండక్షన్ స్టవ్స్ వాడకం పెరుగుతోంది. వీటిని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*స్టీల్, ఐరన్ పాత్రలతో వంట చేసుకోవాలి. రాగి, అల్యూమినియం, గాజు, మట్టి పాత్రలతో సాధ్యం కాదు.
*స్టవ్ లోపల, కంట్రోల్ ప్యానల్‌పై నీళ్లు పడకూడదు.
*స్టవ్‌ చల్లబడేందుకు కింద ఫ్యాన్ ఉంటుంది. దానికి అడ్డుగా వస్తువులు పెట్టకూడదు.
*పాత్ర ఉంచాకే స్టవ్ ఆన్ చేయాలి. అవసరాన్ని బట్టి హీట్ పెంచాలి.

News March 16, 2026

నక్సలైట్ రోల్‌లో పీపుల్స్ స్టార్

image

స్వీయ దర్శకనిర్మాణంలోనే సినిమాలు చేస్తున్న పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి చాలా ఏళ్ల తర్వాత ఓ బయటి చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ హర్ష తెరకెక్కిస్తున్న హుషారు-2లో నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారు. తన ఐడియాలజీకి దగ్గరగా ఉండటంతోనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో టెంపర్ సహా అనేక చిత్రాల కోసం డైరెక్టర్లు సంప్రదించినా ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇకపై ఆయన ఇతరుల సినిమాల్లో నటిస్తారో లేదో వేచి చూడాలి.