News May 1, 2024
‘గాజు గ్లాసు’పై నేడు నిర్ణయం?

AP: జనసేన గుర్తు ‘గాజు గ్లాసు’పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీలో లేని పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాసును కేటాయించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఆ గుర్తును తమకే రిజర్వు చేయాలని కోరింది. వాదోపవాదాల అనంతరం విచారణను న్యాయమూర్తి ఈరోజుకు వాయిదా వేశారు. దీనిపై ఈరోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది.
Similar News
News March 19, 2026
గ్రామాల్లో ఓటర్ల జాబితా ప్రదర్శించాల్సిందే: SEC

AP: సర్పంచ్ ఎన్నికల కోసం పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా <<19333584>>ప్రచురణకు<<>> మరో 4 వారాలు గడువు పొడిగించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని SEC నీలం సాహ్ని తిరస్కరించారు. ఇప్పటికే 13,351 పంచాయతీల్లో ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని ఆమె తెలిపారు. గడువు పెంపునకు సరైన కారణాలు లేవన్నారు. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా జాబితా ప్రచురణ ఆలస్యమైతే పరిశీలించి తగిన ఆదేశాలిస్తామని పేర్కొన్నారు.
News March 19, 2026
రూ.18 వేల కోట్లతో RCB కొనుగోలుకు డీల్!

IPL డిఫెండింగ్ ఛాంపియన్ RCB జట్టు అమ్మకం వ్యవహారం తుది దశకు చేరుకుంది. ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు మనిపాల్ గ్రూప్-US-సింగపూర్ సంస్థలతో కూడిన కన్సార్షియం, స్వీడన్‌కు చెందిన ‘ఈక్యూటీ(EQT)’ బరిలో నిలిచాయి. EQT కంపెనీ రూ.18,486 కోట్లకు బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ డీల్ ఖరారైతే IPLలో హయ్యెస్ట్ వాల్యూ ఫ్రాంచైజీగా, ప్రపంచంలోనే అత్యంత ధనిక జట్లలో ఒకటిగా RCB నిలవనుంది.
News March 19, 2026
‘ధురంధర్-2’ రివ్యూ&రేటింగ్

రెహమాన్(అక్షయ్)ను హమ్జా(రణ్‌వీర్) చంపాక PAK ఉగ్ర నెట్‌వర్క్‌ను కూల్చేసిన స్పై కథే ధురంధర్-2. హమ్జా గతం, ల్యారీ పీఠం కోసం సాగే ఆధిపత్య పోరు, మైండ్ గేమ్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్‌ను డైరెక్టర్ ఆదిత్య ధర్ అద్భుతంగా తెరకెక్కించారు. రణ్‌వీర్ నటనతో విజిల్స్ కొట్టించారు. దేశభక్తి, యాక్షన్ సీన్స్, BGM ప్లస్. హీరోయిన్ సారా పాత్రకు ప్రాధాన్యం లేదు. కొన్ని సాగదీత సీన్లు, రక్తపాతం మైనస్.
రేటింగ్: 3.25/5


