News February 13, 2026
రామగుండం ‘లెక్క’ మొదలు!

రామగుండం నగర కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠగా ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తొలుత 467 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం, 59 డివిజన్లకు సంబంధించిన 544 బ్యాలెట్ బాక్సులను తెరిచారు. ఈ ప్రక్రియలో 72 మంది సూపర్వైజర్లు, 144 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు నిమగ్నమయ్యారు.
Similar News
News April 18, 2026
పొదిలిలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా

పొదిలికి చెందిన కొదమల నాగరాజు అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇటీవల భర్త మరొక యువతితో సంబంధం పెట్టుకుని తనని వేధిస్తున్నాడని దీంతో పుట్టింటికి వెళ్లానని భార్య తెలిపింది. భర్తలో మార్పు రాకపోతుందా అని తాను ఇంటికి రాగా.. మామ అసభ్యంగా మాట్లాడి ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించింది. దీంతో ఆమె పిల్లలతో ఇంటి ముందు కూర్చుని ధర్నా చేసింది.
News April 18, 2026
నెల్లూరు: విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

లింగసముద్రం (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. జంపాలవారిపాలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి గడ్డం వినయ్ బాబు స్నేహితులతో కలిసి జంగారెడ్డిపాలెం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI రాంబాబు దర్యాప్తు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని చెక్‌డ్యాం నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
News April 18, 2026
బాలయ్య-కొరటాల కాంబోలో సినిమా?

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో సినిమా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తీస్తున్న సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉండగా.. ఇది పూర్తయ్యాక కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను కొరటాల సిద్ధం చేశారని, ‘దేవర-2’కి ముందే ఇది రాబోతుందని సమాచారం.


