News May 1, 2024
RESULTS.. టెన్త్ విద్యార్థులకు అలర్ట్

TG: టెన్త్ విద్యార్థులు ఇవాళ్టి నుంచి మే 15 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు చెల్లించవచ్చు. రీకౌంటింగ్‌కు ₹500, రీవెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు ₹1000 చెల్లించాలి. దరఖాస్తులో HMతో సంతకం చేయించి, హాల్‌టికెట్ జతపరిచి DEO ఆఫీసులో ఇవ్వాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్ కోసం అప్లై చేయకూడదు. అటు జూన్ 3 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఫైన్ లేకుండా మే 16 వరకు ఫీజు కట్టొచ్చు.
Similar News
News March 18, 2026
మొజ్తబాను వెతికి పట్టుకుని చంపేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని వెతికి పట్టుకుని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది. ‘ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తాం. మా దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి <<19410383>>తప్పించుకోలేరు<<>>. వారిని వెంబడిస్తాం. కనుగొంటాం. హతమారుస్తాం’ అని IDF ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. అయితే మొజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం లేదని చెప్పారు.
News March 18, 2026
రేణు దేశాయ్‌పై అసభ్య పోస్టులు.. ఇద్దరి అరెస్ట్

నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో <<19265289>>అసభ్యకర పోస్టులు<<>> పెట్టిన ఇద్దరు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అశ్లీల పదజాలంతో వేధిస్తున్నారని ఇటీవల 4 SM అకౌంట్లపై రేణు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. SMలో వేధించే కేటుగాళ్లను వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. బాధితులు తమను సంప్రదించాలని సూచించారు.
News March 18, 2026
మార్చి 18: చరిత్రలో ఈ రోజు

*1871: భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం
*1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మా గాంధీకి 6 ఏళ్ల జైలు శిక్ష
*1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
*1965: అంతరిక్షంలో నడిచిన తొలి రోదసీ యాత్రికుడిగా అలెక్సీ లియనోవ్ రికార్డు
*1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ పదవీ విరమణ (ఫొటోలో)


