News February 13, 2026

BREAKING: కోదాడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 35 వార్డులకు గాను 23 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 1 వార్డు BRS, 3 వార్డులు ఇతరులు గెలిచారు. మిగితా వాటిల్లో కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Similar News

News April 18, 2026

ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ: ఈడీ దుర్గాబాయి

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2015-16 నుంచి 2018-19 మధ్య స్వయం ఉపాధి రుణాలు పొందిన వారు ఈ నెల 30లోపు అసలు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా మాఫీ చేస్తామని ఈడీ దుర్గాబాయి తెలిపారు. గడువు దాటితే అసలుతో పాటు వడ్డీ కట్టాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 18, 2026

HYD: 10 DANGER స్పాట్లు ఇవే!

image

HYDలో ఎండలు ఎక్కువగా ఉండే హాట్ స్పాట్‌లను HMDA అధికారులు గుర్తించారు. ఆసిఫ్‌నగర్, మెహదీపట్నం నవోదయ కమ్యూనిటీ హాల్, విఠల్‌వాడి, ప్యాటన్ కమ్యూనిటీ హాల్, పాటిగడ్డ, అజంపురా వార్డ్ ఆఫీస్, అల్లాబుదా వాటర్ రిజర్వాయర్, మలక్‌పేట్ మిల్లత్ కమ్యూనిటీ హాల్, బతుకమ్మ కుంట ESS, జూబ్లీహిల్స్ ప్రాంతాలని తేల్చారు. నగరవాసులు ఉ.11- సా.4 వరకు అనవసరంగా బయటకు రావొద్దని, వస్తే గొడుగు, వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలన్నారు.

News April 18, 2026

HYD: IPL మ్యాచ్.. నగరంలో ట్రాఫిక్ డైవర్షన్స్

image

ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు IPL మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ డైవర్షన్స్ అమలులో ఉంటాయని పోలీసులు తెలియజేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లకుండా HMDA భగాయత్, మెహ్‌ఫిల్ హోటల్, నాగోల్ మెట్రో స్టేషన్, యూ- టర్న్, హబ్సిగూడ క్రాస్ రోడ్డు, స్ట్రీట్ నంబర్ 8 డైవర్షన్ ప్రాంతాలని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల నుంచి డైవర్ట్ అయి వెళ్లాలన్నారు.