News February 13, 2026

అల్లూరి: ఇకపై స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖగా మార్పు

image

గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్-21 జారీ చేసిందని స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖ అల్లూరి జిల్లా నోడల్ అధికారి పీఎస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖను స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖగా మార్పు చేశారన్నారు. ఇకపై ఇదే పేరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును అధికారులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

గుంటూరులో హిరో బాలయ్య సందడి!

image

గుంటూరులో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ నటి డింపుల్ హయాతి సందడి చేశారు. వీరిద్దరూ గురువారం ఓ నూతన జువెలరీ షోరూమ్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. షోరూమ్‌లో డిజైన్లను పరిశీలించిన బాలయ్య యాజమాన్యాన్ని అభినందించారు. తన ప్రియతమ నటుటులను చూసేందుకు అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

News April 16, 2026

‘కంకణం కట్టుకోవడం’ వెనుక ఎంతో అర్థం

image

ఒక పనిని కచ్చితంగా, దృఢ సంకల్పంతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పే సందర్భంలో ‘కంకణం కట్టుకోవడం’ అనే జాతీయాన్ని వాడతాం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలకు ముందు మణికట్టుకు కంకణ ధారణ చేస్తారు. ఇది మూడు/ఐదు పోగులతో ఉంటుంది. దీన్ని మామిడాకు/తమలపాకు/పసుపుకొమ్ముతో అలంకరిస్తారు. ఇలా చేస్తే ఆ కార్యం విజయవంతంగా పూర్తయ్యేందుకు సర్వేశ్వరుడు రక్షణగా ఉంటారని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 16, 2026

శాతవాహన వర్సిటీ ఈసీ సభ్యుల నియామకం

image

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. సభ్యులుగా ప్రొఫెసర్ జాఫర్ జరీ, ప్రిన్సిపల్స్ రమాకాంత్, భిక్షపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హరికాంత్, లెక్చరర్ రజిత నియమితులయ్యారు. ప్రముఖుల కోటాలో వంగల మురళీ మోహన్, కవిత ఆలేటి, వూటుకూరి రవీందర్ రెడ్డి, సిరిపురం ఈశ్వర్‌లకు చోటు దక్కింది.