News February 13, 2026
సిరిసిల్ల: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బి.గితే సూచించారు. సినారె కళామందిరంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. పాసులు లేని వ్యక్తులను లోనికి అనుమతించవద్దని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐలు మొగిలి, కృష్ణ, తదితరులు ఉన్నారు.
Similar News
News April 18, 2026
సూర్యాపేట: ‘టి-హబ్ సేవలను మరింత బలోపేతం చేయాలి’

సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన టి-హబ్ సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యం 1500 మందికి పైగా రోగులకు సుమారు 5500 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్త పరీక్షల్లో నాణ్యత, ఖచ్చితమైన ఫలితాలు వచ్చేలా పర్యవేక్షణ పెంచాలని అధికారులను ఆదేశించారు. నమూనాల తిరస్కరణపై నివేదిక కోరడంతో పాటు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
News April 18, 2026
కామారెడ్డి: సప్త ప్రాకారాల సిద్ధిరామేశ్వరాలయం

భిక్కనూర్‌లోని సిద్ధిరామేశ్వర ఆలయానికి సప్తప్రాకారాల ఆలయంగా పేరు ఉంది. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయంగా చెబుతారు. ఈ ఆలయానికి ఏడు వరసల గోడలు ఉండటం వల్ల ఈ పేరు వచ్చిందని, శత్రువుల దాడి నుంచి కాపాడటానికి ఈ నిర్మాణం చేశారని స్థానికులు చెబుతారు. ఆలయ ప్రవేశ ద్వారాలు, స్తంభాలపై కాకతీయుల శిల్పకళా ముద్రలు కనిపిస్తాయి. సుమారు 800 సం.రాల క్రితం నిర్మించారని చరిత్రకారులు భావిస్తారు.
#WORLD HERITAG SPECIAL
News April 18, 2026
ఇందిరమ్మ ఇళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..!

TG అర్బన్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో దశలో సొంత స్థలం లేని వారిని L2 జాబితాలో తీసుకొని వారికి 2BHK ఇళ్లు ఏ స్థితిలో ఉంటే అలాగే అప్పగించాలని GOVT నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారి Way2Newsకు తెలిపారు. మిగిలిన పనులను లబ్ధిదారులే పూర్తి చేసుకుంటే వారికి బిల్లులు మంజూరు చేస్తారు. వీటి కోసం లబ్ధిదారుల కమిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి MBNR జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.


