News February 13, 2026
కాకాణి కుమార్తెకు నోటీసులు

కోవూరు మండలంలో ఇటీవల మైనర్ బాలిక మృతి దుమారం రేపింది. ఈక్రమంలో ఆమె మృతిపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 16వ తేదీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. బాలిక మృతి మీద ఆమె దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రావాలని కోరారు.
Similar News
News April 17, 2026
నెల్లూరులో రేపటి IAB వాయిదా

నెల్లూరు జడ్పీ ఆఫీసులో శనివారం జరగాల్సిన ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డ్(IAB) మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాలతో సమావేశం వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.
News April 17, 2026
నెల్లూరు జిల్లాలో 90 మందికి ప్రమోషన్

నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేస్తున్న గ్రేడ్–IV పంచాయతీ అభివృద్ధి అధికారులకు గ్రామ పంచాయతీ జూనియర్ సహాయకులు కం బిల్ కలెక్టర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఈ మేరకు డీపీవో వసుమతి ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 89 మంది పంచాయతీ అభివృద్ధి అధికారులతో పాటు ఓ జూనియర్ సహాయకుడికి కలిపి మొత్తం 90 మందికి గ్రేడ్–III పంచాయతీ అభివృద్ధి అధికారులుగా ప్రమోషన్ కల్పించారు.
News April 17, 2026
హాస్టల్ విద్యార్థులకు నెల్లూరు కలెక్టర్ అభినందనలు

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం కలెక్టరేట్‌లో అభినందించారు. 479 మార్కులు సాధించిన కె.గణేష్‌తో పాటు ప్రతిభచూపిన పి.పూజ, బి.పుష్పలత, ఎస్.అనూష, టి.సుమతి, పి.శ్రీవేణుకు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు ఇలాగే కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.


