News May 1, 2024
ఏలూరు: అమ్మవారిని దర్శించుకొని వస్తుండగా తండ్రి, కూతురు మృతి

పెదపాడు మండలం కలపర్రు నేషనల్ హైవేపై మంగళవారం జరిగిన <<13151338>>రోడ్డుప్రమాదం<<>>లో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. SI శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన యవ్వారి రుద్రరాము భార్యాపిల్లలతో బైక్‌పై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. రుద్రరాము(33), కుమార్తె రక్షశ్రీ(9) అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదైంది.
Similar News
News March 21, 2026
ప.గో: అలర్ట్.. దరఖాస్తుల ఆహ్వానం

ప.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో టూరిజంపై మాట్లాడిన ఆమె, టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు ceo-apta@ap.gov.in మెయిల్ ఐడీకి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 21, 2026
పశ్చిమలో ఆసక్తికర చర్చ..!

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో మహిళల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు మహిళలకు అవకాశం కల్పించలేదు. మహిళా బిల్లు అమలులోకి వస్తే జిల్లాలో మహిళలకు ఎన్ని సీట్లు దక్కుతాయి, ఏయే స్థానాలను వారికి రిజర్వ్ చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.