News February 13, 2026

జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియాకు షాక్ తప్పదా?

image

T20WCలో పసికూన జింబాబ్వే ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చేలా ఉంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు 5 ఓవర్లలో 34 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయారు. ఇంగ్లిస్, హెడ్, గ్రీన్, టిమ్ డేవిడ్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్రీజులో మ్యాక్స్‌వెల్, రెన్షా ఉన్నారు. ఆసీస్ విజయానికి 90 బంతుల్లో 136 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

Similar News

News April 17, 2026

మీరేం సాధించారో ఆలోచించుకోండి.. జగన్ ఆగ్రహం

image

AP: మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలను విమర్శిస్తూ YCP చీఫ్ జగన్ ట్వీట్ చేశారు. ‘మీరేం సాధించారో ఓసారి ఆలోచించుకోండి. మహిళా రిజర్వేషన్ల బిల్లు వాయిదా పడింది. అటు దక్షిణాదికి గానీ ఇటు మహిళలకు గానీ న్యాయం జరగలేదు. ఒకవేళ 2026 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది’ అని పేర్కొన్నారు.

News April 17, 2026

దేశవ్యాప్తంగా నిరసనలకు NDA పిలుపు

image

మహిళా బిల్లు వీగిన నేపథ్యంలో విపక్షాల తీరును ఎండగడుతూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని NDA నిర్ణయించింది. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో BJP మహిళా నేతల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరగనున్నాయి. మూడు వారాల పాటు వీటిని కొనసాగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నిరసనలతో ప్రతిపక్షాల వైఖరి గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

News April 17, 2026

రాణించిన గ్రీన్.. KKR స్కోర్ 180

image

IPLలో రూ.25.2 కోట్ల ఆటగాడు <<19653410>>కామెరూన్ గ్రీన్‌(KKR)<<>> ఎట్టకేలకు తన స్థాయికి తగ్గట్లు ఆడారు. GTతో మ్యాచులో 32కే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగుకు వచ్చి 55 బంతుల్లో 79 పరుగులు(4 సిక్సులు, 7 ఫోర్లు) చేశారు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో 180 స్కోరుకు ఆలౌటైంది. టిమ్ 19, రహానే 0, రఘువంశీ 8, పావెల్ 27, అనుకుల్ 9, రింకూ 1, రమణ్‌దీప్ 17 రన్స్ చేశారు. రబాడ 3, అశోక్ 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ ఒక వికెట్ తీశారు.