News February 13, 2026
ములుగులో మున్సిపాలిటీలో ఖాతా తెరిచిన బీజేపీ

ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్‌కి 154 ఓట్లు, బీఆర్ఎస్‌కు 173 ఓట్లు, బీజేపీకి 211 ఓట్లు లభించాయి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒక ఓటు నమోదు కాగా, నోటాకు 2 ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి కొత్త సురేందర్ అత్యధిక ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు.
Similar News
News February 20, 2026
ట్రోలిన్ పేలి.. గట్టుసింగారం వాసి మృతి

యాదాద్రి (D) భూదాన్ పోచంపల్లి ధోతిగూడెం శివారులోని ఓ కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కూసుమంచి గట్టుసింగారానికి చెందిన ధార పవన్ మృతి చెందారు. భోజన విరామ సమయంలో కార్మికులంతా బయటకు వెళ్లగా, విధుల్లో ఉన్న పవన్ వద్ద ట్రోలిన్ పేలింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు సీనియర్ కెమిస్ట్రీ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 20, 2026
కాళ్ల: పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీ

పదో తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ నారాయణ అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు, జువ్వలపాలెం హైస్కూల్ లను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. గత ఏడాది ఈరెండు పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణశాతం 36 సాదించారని, రాబోయే మార్చి 16 నుంచి జరుగనున్న పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు
News February 20, 2026
ట్రంప్‌కు BIG SHOCK

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయా దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లను కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి టారిఫ్‌ల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం చట్టవిరుద్ధమని తెలిపింది. సుప్రీం తీర్పుతో US మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.


