News February 13, 2026
వరంగల్: మార్కెట్‌కు 4 రోజులు సెలవులు

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 14 శనివారం నుంచి 17వ తేదీ మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల సెలవులు ఇచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. శనివారం వారాంతపు సెలవు, ఆదివారం మహాశివరాత్రి పర్వదిన సెలవు, సోమవారం జాగారం సెలవు, మంగళవారం అమావాస్య సెలవు కారణంగా మార్కెట్‌కు వరుస సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18 బుధవారం నుంచి మార్కెట్ ప్రారంభమవుతుందని రైతులు గమనిచాలన్నారు.
Similar News
News April 18, 2026
గజ్వేల్: భూసార పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చేనా..?

గజ్వేల్ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని 2023 అక్టోబరులో గత ప్రభుత్వంలో హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే దీనికి ఇప్పటికీ సిబ్బంది నియామకం, ల్యాబ్ పరికరాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, తమ భూములను పరీక్షించుకునే వెసులుబాటు కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
News April 18, 2026
కాళేశ్వరం బ్యారేజ్‌ల పరిశీలనకు 43 రోజుల గడువు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల వైఫల్య కారణాల విశ్లేషణకు రాష్ట్ర ప్రభుత్వం 43 రోజుల గడువు నిర్ణయించింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో 9 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. మే 30లోగా పరీక్షలు పూర్తి చేసి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
News April 18, 2026
GNT: పెరుగుతున్న కులాంతర వివాహాలు

సమాజంలో కులాల అడ్డు గోడలు కూలుతున్నాయి. యువత ఆలోచనల్లో విశేష మార్పు వస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా 600కు పైగా కులాంతర పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నగరాల్లో ఈ సంఖ్య పెరుగుతుండగా, పల్లెల్లో ఇంకా భయం నెలకొంది. ఈ పెళ్లిళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత ముందున్నారు. వేర్వేరు కులాల మధ్య వివాహాలతో జన్యు వైవిధ్యం పెరిగి భావితరాలు ఆరోగ్యంగా ఉంటాయని సైన్స్ చెబుతోంది.


