News February 13, 2026

కామారెడ్డి: 14, 32 వార్డులో గెలుపొందిన పిన్న వయస్కుకులు

image

కామారెడ్డి మున్సిపాలిటీలో ఫలితాలు ఒక్కొక్కటి వెలవడుతున్నాయి. 32 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గ్యార అఖిల విజయం సాధించగా, 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ శెట్టి హర్షిత గెలుపొందారు. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీలో అతిపిన్న వయసున్న ఇద్దరు మహిళలు గెలుపొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువత సైతం రాజకీయాల్లో రాణించగల నమ్మకం ఏర్పడినట్లు అయింది.

Similar News

News April 19, 2026

టిమ్ డేవిడ్.. IPLలో అరుదైన మైల్‌స్టోన్

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హిట్టర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. IPLలో అతి తక్కువ బంతుల్లో (560) వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) తర్వాత ఆయనే టాప్. అంతేకాదు కనీసం వెయ్యి పరుగులు చేసిన వారిలో 175 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక బ్యాటర్ డేవిడ్ కావడం విశేషం.

News April 19, 2026

NGKL: సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ

image

మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 సంవత్సరానికి గాను కౌన్సిలర్, కంప్యూటర్ ఆపరేటర్, సెక్యూరిటీ, మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ ధృవపత్రాలతో జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 19, 2026

జగిత్యాల: క్రీడా కోర్సులకు ప్రవేశ పరీక్షలు

image

క్రీడా రంగంలో ఉన్నత విద్యను అందించే ఎల్.ఎన్.ఐ.పి.ఇ (LNIPE) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది. డిప్లొమా, బీపీడ్, ఎంపీడ్, స్పోర్ట్స్ సైన్స్, జర్నలిజం వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని జిల్లా క్రీడల అధికారి రవి కుమార్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు www.lnipe.edu.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.