News May 1, 2024

కొండాపురం: వడదెబ్బతో యువకుడి మృతి

image

కొండాపురం మండలం బురుజుపల్లెకు చెందిన రాచుమల్లు మల్లారెడ్డి (30) వడ దెబ్బతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు..  గ్రామానికి చెందిన శివమల్లారెడ్డి మంగళవారం ఉదయం తోటకు వెళ్లే దారిలో ఎండ తీవ్రతకు స్పృహ కోల్పోయాడు. తాడిపత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News March 25, 2026

కడప జిల్లా రాజకీయాల్లో పురుషాధిక్యతకు గండి.!

image

ఉమ్మడి కడప(D)లో ఇప్పటి వరకు పులివెందుల, బద్వేల్, కడప, రాజంపేట, కోడూరు నుంచే మహిళలు MLAలుగా ఉన్నారు. ప్రస్తుతం KDP, BDVL నుంచి మహిళలు MLAలుగా ఉన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు రిజర్వేషన్ అమలు అయితే వీరి సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ స్థానాల ప్రకారం జిల్లాలో ఏకకాలంలో ఒక MP, ఐదుగురు మహిళలు MLAలుగా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో జిల్లా రాజకీయల్లో పురుషాధిక్యతకు బ్రేక్ పడనుంది.

News March 25, 2026

మారనున్న కడప రాజకీయ ముఖచిత్రం

image

నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి కడప జిల్లాలో కొత్తగా 1MP, 4 MLA స్థానాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో పార్లమెంట్ స్థానాలు 3, అసెంబ్లీ నియెజకవర్గాలు 14 కానున్నాయి. మహిళలకు 1 MP, 5 MLA స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది. జిల్లాలో ఇప్పుడున్న SC నియోజకవర్గాలు మారడం, కొత్తవి ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో MLAలు, మాజీ MLAలు, ఆశావహులు తమ స్థానాలు గల్లంతవుతాయేమోనని టెన్షన్ పడుతున్నారు.

News March 25, 2026

రాజంపేట MP తల్లికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

image

MP మిథున్ రెడ్డి తల్లికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్ కింద 6 ప్యాకేజీల పనులు చేశామని, రూ.64.18 కోట్ల బిల్లులు రావాలన్నారు. తన భర్త, కుమారుడు ప్రతి పక్షంలో ఉన్నారని, అందుకే GOVT బిల్లులను విడుదల చేయలేదన్నారు. దీన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది.