News February 13, 2026

రాయికల్‌లో ‘కమలం’ జోరు

image

జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 12 వార్డులకు గాను బీజేపీ 5 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 3 వార్డుల్లో జయకేతనం ఎగురవేయగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు ‘స్వతంత్ర’ అభ్యర్థి మద్దతు కీలకం కానుంది.

Similar News

News March 31, 2026

NTR: NH (65)పై టోల్ ట్యాక్స్ తగ్గింపు..!

image

విజయవాడ-HYDను కలిపే NH-65పై వాహనదారులకు టోల్ పన్ను భారం నుంచి స్వల్ప ఉపశమనం లభించింది. కొన్ని వాహనాలపై టోల్ రుసుము రూ.5 చొప్పున తగ్గించారు. ఏప్రిల్-1 ఉ.12 నుంచి అమల్లోకి వస్తుంది. పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు వద్ద కొందరు వాహనాలపై రుసుము తగ్గించారు. త్రీ యాక్సిల్‌ కమర్షియల్‌ వాహనాలు, కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. అన్నింటికీ కాకుండా, కొన్ని కేటగిరీలకే తగ్గింపు పరిమితమైంది.

News March 31, 2026

ఖమ్మం ఇరిగేషన్ సీఈగా వెంకటేశ్వర్లు బాధ్యతలు

image

ఖమ్మం జిల్లా ఇరిగేషన్ సీఈగా మంగళంపూడి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సీఈగా పనిచేసిన వెంకటరమేష్ బాబు మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఖమ్మం ఎస్ఈగా కొనసాగుతున్న వెంకటేశ్వర్లకు సీఈగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది. పదోన్నతి పొందిన ఆయనను ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది అభినందించారు.

News March 31, 2026

కడప జిల్లాలో విషాదం

image

కడప జిల్లా తొండూరు (M) మల్లేలలో మంగళవారం రాత్రి తల్లీకూతురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన షేక్ బీబీ(58), షేక్ ఇమాంబి(35) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని కనిపించారు. షేక్ బీబీ భర్త షేక్ ఇమామ్ బాషా ఇంట్లో కనిపించడం లేదు. అప్పుల బాధతో కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.