News February 13, 2026
మెదక్: ఒక్క ఓటుతో గెలుపు

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కే.హరిత కేవలం ఒక ఓటుతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రావుపై విజయం సాధించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 18, 2026
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్

తూప్రాన్ ఐవోసీ భవనంలో శుక్రవారం జనగణనపై అదనపు కలెక్టర్ నగేశ్ సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బ్లాకులుగా విభజించి పకడ్బందీగా గణన చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో జయచంద్ర రెడ్డి, MRO చంద్రశేఖర్ రెడ్డి, MPDO సతీశ్ పాల్గొన్నారు. గణన సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News April 18, 2026
ద్విచక్ర వాహనాలు ఢీ.. పదో తరగతి విద్యార్థి మృతి

టేక్మాల్ (M) ఎల్లంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సండ్రు సదానందం (16) మృతి చెందగా, శెట్టి గోపాల్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ వేర్వేరు బైక్‌లపై వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే సదానందం ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడు ఇటీవలనే SSC పరీక్షలు రాశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 18, 2026
మెదక్ జిల్లాలో కాకతీయ శిల్పం గుర్తింపు

చిన్నశంకరంపేట మండలం మండలంలోని గవ్వలపల్లి శివాలయం వద్ద కాకతీయ శైలికి చెందిన తాంత్రిక భైరవ శిల్పాన్ని చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. చతుర్భుజాలతో, మెడలో సర్పహారం, డమరుకం ధరించి త్రిభంగిమలో ఉన్న ఈ శిల్పం అరుదైనదని ఆయన తెలిపారు. మన పూర్వీకులు అందించిన ఇలాంటి పురాతన విగ్రహాలను, చారిత్రక సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.


