News May 1, 2024

నేడు పాయకరావుపేటలో జగన్ పర్యటన

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం పాయకరావుపేట రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేట సూర్య మహల్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

Similar News

News July 7, 2025

విశాఖ: ‘రాందేవ్ బాబాకు భూ కేటాయింపులు ఆపండి’

image

జీఓ 596కు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసిన 6లక్షల ఎకరాల భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ఎస్సీలకే కేటాయించాలని విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు. శారదా పీఠం నుండి తీసుకున్న భూములు రామ్ దేవ్ బాబాకు ఇవ్వొద్దని, ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలపై వేసిన రెండు సిట్‌ల నివేదికలూ బయట పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News July 7, 2025

విశాఖ: వైసీపీ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు

image

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేయగా బెయిల్ మంజూరు అయింది. గత నెల 23వ తేదీన నిర్వహించిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నోటీసులు ఇవ్వడంతో ఇవాళ మహారాణిపేట సీఐ భాస్కరరావు ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. కోర్టు మంజూరు చేసిన బెయిల్ పత్రాలను సీఐకు సమర్పించారు.

News July 7, 2025

విశాఖ: పోలీస్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందజేత

image

ఆర్కే బీచ్ వద్ద పోలీస్ విభాగానికి వివిధ సంస్థలు, ప్రభుత్వం సమకూర్చిన ఏసీ హెల్మెట్లు, టూవీలర్స్, ఇతర సామగ్రిని హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం అందజేశారు. పోలీస్ సిబ్బందికి మౌలిక వసతులు అందిస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆమె అన్నారు. దాదాపు రూ.70 లక్షలతో 20 హెల్మెట్లు, 64 ద్విచక్ర వాహనాలు, రెండు కెమెరాలు అందజేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.