News February 13, 2026
సభలో మోగిన అనంతపురం స్వరం!

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా మహిళా MLAలు పరిటాల సునీత, బండారు శ్రావణి, పల్లె సింధూరరెడ్డి గళమెత్తారు. ఆత్మకూరు, అనంతపురం మండలాల్లోని 50గ్రామాల్లో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని <<19129909>>సునీత<<>> డిమాండ్ చేశారు. శింగనమల నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాలపై <<19129184>>శ్రావణి<<>>, శ్రీకృష్ణదేవరాయల జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని <<19127732>>సింధూర<<>> ప్రభుత్వాన్ని కోరారు.
Similar News
News April 17, 2026
మాత్రలను చల్లటి నీటితో వేసుకుంటున్నారా?

ఏదైనా అనారోగ్యానికి మాత్రలను, పొడి రూపంలోని ఔషధాలను గ్లాసు గోరు వెచ్చని నీటితో వేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చల్లటి నీటితో తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ కరగడం ఆలస్యమవుతుందంటున్నారు. ‘పాలు, జ్యూస్‌లు, కూల్ డ్రింకులు, లిక్కర్‌తో మందులు వేసుకుంటే వాటి ప్రభావం తగ్గుతుంది. మాత్రలను పొడి చేయడం, నీళ్లలో కలపడం లాంటివి చేయొద్దు. దీనివల్ల ఒకేసారి మందు విడుదలై ప్రమాదకరంగా మారొచ్చు’ అని చెబుతున్నారు.
News April 17, 2026
ప్రతీ ఇంటినుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: VZM కలెక్టర్

ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మహారాజా కోటలో శుక్రవారం ప్రారంభమైన రెండురోజుల వెండార్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లఘు ఉద్యోగ్ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సీఐటీడీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2026
NZB: కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ధాన్యం, మొక్కజొన్న, పసుపు విక్రయాలకు సంబంధించి 08462-220183 నంబర్‌కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.


