News February 13, 2026

BREAKING: లక్షెట్టిపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 15 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Similar News

News February 14, 2026

పరకాల: ఒక్క ఓటుతో కౌన్సిలర్‌గా విజయం!

image

పరకాల 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర ఒక్క ఓటుతో విజయం సాధించారు. 17వ వార్డులో BRS అభ్యర్థి రజనీకి 368 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సుభద్రకు 366 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లో వచ్చిన 3 ఓట్లను కలిపి సుభద్రకు 369 ఓట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. రీ-కౌంటింగ్ చేసినా ఒక్క ఓటు ఎక్కువ రావడంతో సుభద్ర విజయం సాధించారు. ఒక్క ఓటు కూడా ముఖ్యమేనని ఈ విజయం మరోసారి నిరూపించింది.

News February 14, 2026

వరంగల్: ప్రత్యర్థుల ఎగతాళి నుంచి మున్సిపల్‌లో గెలుపు వరకు!

image

తన రాజకీయ అనుభవం అంత లేని యువతి చేతిలో ఓటమి పాలయ్యావంటూ ప్రత్యర్థులు చేసే ఎగతాళి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉపశమనం కలిగినట్లయింది. తొర్రూర్ మున్సిపాలిటీలో 16 వార్డులకు ఎన్నికలు జరిగితే , BRS 9, కాంగ్రెస్ 7 వార్డులను కైవసం చేసుకున్నాయి. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎర్రబెల్లి, విజయం సాధించకపోతే మరో అపవాదును మూట గట్టుకునే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

News February 14, 2026

కరీంనగర్‌లో నేడే సదస్సు.. మిస్ అవ్వకండి..!

image

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10thక్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News&Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. KNRముకరంపురలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదురుగా ప్రతిమ హోటల్‌లో FEB 14న (శనివారం) సా.6 గంటలకు జరిగే ఈసదస్సులో CBI EXజేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు.