News February 13, 2026

BREAKING: సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ పీఠాలు కాంగ్రెస్‌వే

image

మంత్రి పొంగులేటి ఇలాకా కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీ పీఠాలు కాంగ్రెస్ గెలిచింది. కల్లూరులో మొత్తం 20 వార్డులకు 12 వార్డులు కాంగ్రెస్ గెలిచి మున్సిపల్ పీఠాన్ని సాధించింది. ఇక్కడ BRS 7, ఇండిపెండెంట్ 1 వార్డు గెలిచాయి. ఇక సత్తుపల్లిలో 23 వార్డులకు గాను 14 వార్డులు కాంగ్రెస్ గెలిచి మున్సిపల్ పీఠాన్ని సాధించింది. ఇక్కడ BRS 4 గెలుపొందగా మిగతా చోట్ల కౌంటింగ్ జరుగుతోంది.

Similar News

News April 18, 2026

HYD: IPL మ్యాచ్.. నగరంలో ట్రాఫిక్ డైవర్షన్స్

image

ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు IPL మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ డైవర్షన్స్ అమలులో ఉంటాయని పోలీసులు తెలియజేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లకుండా HMDA భగాయత్, మెహ్‌ఫిల్ హోటల్, నాగోల్ మెట్రో స్టేషన్, యూ- టర్న్, హబ్సిగూడ క్రాస్ రోడ్డు, స్ట్రీట్ నంబర్ 8 డైవర్షన్ ప్రాంతాలని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల నుంచి డైవర్ట్ అయి వెళ్లాలన్నారు.

News April 18, 2026

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం BJP ఓటమే: సీఎం రేవంత్

image

TG: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం BJP ఓటమి అని, విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిందని CM రేవంత్ అన్నారు. ‘NDA నిజాయతీగా బిల్లు తీసుకురాలేదు. 3 బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేసింది. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేస్తే మద్దతిస్తాం. మహిళా రిజర్వేషన్లలోనూ SC, ST, OBC కోటాలు ఉండాలి’ అని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. BJPకి 400సీట్లు వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు.

News April 18, 2026

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు

image

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ (కరవు భత్యం) పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా గతేడాది అక్టోబర్‌లో డీఏ పెంచింది.