News February 13, 2026

BREAKING: భూదాన్ పోచంపల్లిలో హంగ్

image

యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 13 వార్డులకు గాను కాంగ్రెస్ 6, BRS 5, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 వార్డు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 7 ఎవరూ సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News February 17, 2026

ఇది కదా సక్సెస్ అంటే..

image

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్య పాత ఫొటో ఒకటి SMలో వైరలవుతోంది. 2014లో తన ఫ్రెండ్ పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవానికి హాజరైనప్పటి ఫొటో అది. కట్ చేస్తే.. కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని 30Y వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. సక్సెస్ అంటే ఇదేనని, ఎంత ఎత్తుకు ఎదిగినా అతను ఇప్పటికీ తన స్నేహితులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని నెటిజన్లు పేర్కొంటున్నారు.

News February 17, 2026

అల్లూరి జిల్లాలో 97.85 శాతం లక్ష్యం పూర్తి: కలెక్టర్

image

2 నుంచి 19ఏళ్ల విద్యార్థులందరూ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. మంగళవారం పాడేరు మండలం గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. పలువురు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. జిల్లాలో 97.85 శాతం లక్ష్యం పూర్తయిందని తెలిపారు. మిగిలిన పిల్లల కోసం ఈనెల 24న మాప్-అప్ డే నిర్వహిస్తున్నారన్నారు.

News February 17, 2026

నీటి చౌర్యం అరికట్టండి: మంత్రి సత్యకుమార్

image

నీటి చౌర్యాన్ని అరికట్టాలని ఉమ్మడి అనంతపురం జిల్లాల కలెక్టర్లను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన.. ధర్మవరం నియోజకవర్గ చెరువులు నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సోర్స్ వద్ద 600 క్యూసెక్కులు విడుదలవుతుంటే, మన్నీల వద్దకు కేవలం 65 క్యూసెక్కులే రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కింద ఉన్న గ్రామాలకు న్యాయం చేయాలని సూచించారు.