News February 13, 2026
బెల్లంపల్లి మున్సిపల్‌లో హంగ్

బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. 34 వార్డులకు కాంగ్రెస్ 14, బీఆర్ఎస్-14 వార్డులు, ఇండిపెండెంట్లు 05 వార్డులు, బీజేపీ 1వార్డులో గెలుపొందాయి. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు ఇండిపెండెంట్‌లు కీలకం కానున్నారు.
Similar News
News April 18, 2026
నటిపై పరువు నష్టం దావా వేసిన చాహల్

తన పరువుకు భంగం కలిగించేలా SMలో పోస్ట్‌లు, మీడియా ముందు మాట్లాడినందుకు నటి తానియా <<19636894>>ఛటర్జీపై<<>> టీమిండియా క్రికెటర్ చాహల్ సీరియస్ అయ్యారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ.. వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై తానియా స్పందిస్తూ.. ‘ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇది ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. దీనివల్ల నేనే ట్రోలింగ్‌కు గురయ్యా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News April 18, 2026
అల్లూరి: పొట్టకూటి కోసం వచ్చి ప్రమాదానికి గురయ్యారు

జీకేవీధి మండలం బొంతవలసలో వ్యాన్ కొండను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్‌కు నుంచి వచ్చిన వారే. చింతపల్లి జాతరలో గృహోపకరణాలు అమ్మేందుకు వచ్చిన వీరంతా పండగ ముగియడంతో రాజమండ్రి వెళ్తుండగా బొంతువలస వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని రాజేంద్రపాలెం ఆసుపత్రికి తరలించడంతో వైద్యాధికారి జగదీష్ చికిత్స అందించారు.
News April 18, 2026
జగిత్యాల: ‘ఓపెన్’ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

జగిత్యాల జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఓపెన్ టెన్త్‌లో 659 మంది విద్యార్థులకు 4 పరీక్ష కేంద్రాలు, ఇంటర్‌లో 980 మందికి విద్యార్థులు ఉండగా 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.


