News February 13, 2026
లక్షెట్టిపేట: మృతి చెందిన అభ్యర్థికి 171 ఓట్లు

లక్షెట్టిపేటలోని 10వ వార్డులో మృతి చెందిన BJP అభ్యర్థి బత్తిని <<19126131>>ఎల్లమ్మ<<>> 3వ స్థానంలో నిలిచారు. అనారోగ్యంతో శుక్రవారం ఆమె మృతి చెందారు. 10వ వార్డులో మొత్తం 910 ఓట్లు ఉండగా, 684 ఓట్లు పోలయ్యాయి. అందులో ఎల్లమ్మకు 171 ఓట్లు వచ్చాయి. నామినేషన్ వేసిన తర్వాత ఆమె అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పెండెం పద్మ 3 ఓట్లతో విజయం సాధించారు.
Similar News
News April 18, 2026
ఏపీలో ప్రతిపక్షమేది?

ఏపీలో ఉన్న మూడు పెద్ద ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకోగా.. జగన్ పొత్తు లేకపోయినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ BJPకి వ్యతిరేకంగా ఉన్నా దానికి పెద్దగా ప్రజల మద్దతు దక్కడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సౌత్ రాష్ట్రాలన్నీ ఒక దారిలో ఉంటే ఏపీది మరో దారి. మరి ఏపీలో ప్రతిపక్షమేది?
News April 18, 2026
GWL: దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక గ్రీవెన్స్

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు. గ్రీవెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, ఉపకరణాల పంపిణీ, సదరం సర్టిఫికెట్లు తదితర సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
News April 18, 2026
డీలిమిటేషన్.. జాతీయ మీడియాలో రేవంత్ పేరు!

131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లుల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా సీఎంల కంటే ముందుగా రేవంతే ఈ అంశాన్ని లేవనెత్తారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్‌కు అన్యాయం జరుగుతుందని కేంద్రాన్ని విమర్శించారు. హైబ్రిడ్ మోడల్‌లో డీలిమిటేషన్ జరగాలని సరికొత్త పాయింట్‌ను తెరపైకి తెచ్చారు.


