News February 13, 2026

BIG BREAKING: నిర్మల్‌లో కాంగ్రెస్ విజయం

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ మొత్తం 42 వార్డులకు గాను 25 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 14 వార్డులు బీజేపీ, ఎంఐఎం 2, BRS 1 వార్డు గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక్కడ బీజేపీ MLA మహేశ్వర్ రెడ్డి ఎంత ప్రచారం చేసినా ఆ పార్టీని గెలిపించుకోలేకపోవడంతో స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.

Similar News

News February 14, 2026

వేములవాడ: అలిగి, అజ్ఞాతంలోకి వెళ్లి.. టికెట్ సాధించి గెలిచారు..!

image

వేములవాడ 4వ వార్డ్ కౌన్సిలర్ తోట రాజు ఎన్నికలకు ముందు తనకు టికెట్ రాకపోవడంతో అలిగి అజ్ఞాతంలోకి వెళ్లి టికెట్ సాధించారు. సర్వే రిపోర్ట్ అనుకూలంగా లేదంటూ టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ దిగివచ్చి టికెట్ కేటాయించడంతో సిటింగ్ కౌన్సిలర్, బీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్ పై స్వల్ప తేడాతో గెలుపొంది పరువు దక్కించుకున్నారు.

News February 14, 2026

మెతుకుసీమలో పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్

image

ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. మొత్తం 19 మున్సిపాలిటీల్లో 11 చోట్ల కాంగ్రెస్ కంటే అధిక మెజారిటీ సాధించడంతో పాటు 6 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ సాధించడంలో మాజీ మంత్రి హరీశ్ రావు కీలకంగా వ్యవహరించారు. వినూత్న రీతిలో ప్రచారంలో చేసి బీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ నింపడంలో సక్సెస్ అయ్యారు.

News February 14, 2026

వేములవాడ: రెండోసారి.. సారీ..!

image

వేములవాడ నగర పంచాయతీ మాజీ చైర్ పర్సన్ నామాల ఉమకు వరుసగా 2వసారి పరాజయం తప్పలేదు. 2020 ఎన్నికలలో 26వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె.. ఈసారి ఎన్నికలలో 23వ వార్డు కాంగ్రెస్ తరపున బరిలోకి దిగినా ఫలితం దక్కలేదు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకున్నప్పటికీ, తాము బలపరిచిన బోనాల సాగరిక బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో ఆమె పైనే పోటీ చేసి ఓటమి చవిచూడాల్సి రావడం గమనార్హం.