News February 13, 2026
రేపు శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు లేదు: DEO

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయని DEO రవిబాబు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి రేపు రెండో శనివారం అయినప్పటికీ గత ఏడాది తుఫాన్ సందర్భంగా సెలవుల అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాఠశాలలకు పనిదినాలు ఉండనున్నాయని తెలిపారు. పాఠశాలల పనిదినాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు సెలవు రద్దు చేయడం జరిగిందన్నారు.
Similar News
News April 18, 2026
శ్రీకాకుళం: మత్స్యకార భృతి లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు

మత్స్యకారులకు 60 రోజుల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం రూ.20,000 సాయం అందజేస్తోంది. గత ఏడాది జిల్లాలో 15,548 మందికి అందజేశారు. ఈ ఏడాది క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటివి అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 27 నాటికి తుది జాబితా పూర్తి చేసి, 30 నుంచి అర్హులందరీ ఖాతాల్లో నగదు జమ చేస్తామని మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ అన్నారు.
News April 18, 2026
అరసవెల్లి నకిలీ పాసులు ముద్రించిన నిందితుల అరెస్ట్

అరసవెల్లి రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసులు వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఆరుగురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మణికంఠ జిరాక్స్‌లో నకిలీ పాసులు ముద్రించినట్లు నిర్ధారించారు. నిందితుల్లో మణికంఠ జిరాక్స్ షాప్ యజమానులు కొండలరావు, మణికంఠ, సంతోష్‌తో పాటు హరి ప్రసాద్, శీను, రాజు ఉన్నట్లు వన్ టౌన్ ఎస్ఐ హరికృష్ణ తెలిపారు.
News April 18, 2026
నాడు శ్రీకాకుళం కలెక్టర్.. నేడు స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ఉత్తమ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ చంద్ర పునేఠా నేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. 1993-96 మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి సీఎస్ స్థాయికి చేరారు. ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించింది.


