News February 13, 2026

మున్సిపల్ ఫలితాలు.. ఇప్పటి వరకు..

image

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు 65 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ గెలుపు జెండా ఎగరేసింది. BRS 14 చోట్ల గెలుపొందగా, BJP ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. 34 చోట్ల హంగ్ ఏర్పడింది. వార్డుల్లో కాంగ్రెస్ 1,310, BRS 707, BJP 249చోట్ల గెలుపొందాయి. అటు మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.

Similar News

News April 20, 2026

JRG: బెట్టింగ్ ముఠాలో పట్టుబడింది వీరే..!

image

జంగారెడ్డిగూడెం పోలీసులు <<19692230>>బెట్టింగ్ ముఠా<<>>ను అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పుల్లూరి నాగ వెంకట నరసింహాచార్యులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతని విచారణ ఆధారంగా హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలో పోలీసు అధికారులు దాడులు నిర్వహించి మల్లెల వీరాంజనేయులు, పర్వతనేని వేణు, గజ్జల రవీంద్ర రెడ్డి, పల్లెపాగ రవి, తులబంతుల తాండవ కృష్ణలను అదుపులోకి తీసుకున్నారు.

News April 20, 2026

GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

image

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా

News April 20, 2026

అక్షయ తృతీయ అంతంత మాత్రమే!

image

అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడాలి. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల కస్టమర్లు దుకాణాలకు రావడానికే భయపడ్డారు. గతేడాది Hydలో 150 kgల బంగారం అమ్ముడైతే, ఈసారి అది 70 kgలకే పరిమితమైనట్లు వ్యాపారులు తెలిపారు. భారీ డిస్కౌంట్లు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్నపాటి కాయిన్స్ కొనడానికే చాలా మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.