News February 13, 2026
ప్రెగ్నెన్సీకి సిద్ధంగా ఉన్నారా?

ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పటి నుంచే చాలా విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చడానికి ముందు మహిళలు తమ శరీరం అందుకు సహకరించేలా చూసుకోవాలి. ఎముకలు, కండరాల పటిష్టత, శరీరంలోని రక్తం పరిమాణం, శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వ్యాయామం, పోషకాహారం తప్పనిసరి. థైరాయిడ్, విటమిన్ D3, విటమిన్ B12, బ్లడ్ షుగర్ టెస్టులు కూడా చేయించుకోవాలి.
Similar News
News April 16, 2026
INDలో పెరుగుతున్న ‘స్లీప్ షేమింగ్’.. ఏంటిది?

తక్కువ నిద్రపోవడాన్ని గొప్పగా, ఎక్కువ పోతే సోమరితనంగా భావించే అలవాటు భారతీయుల్లో పెరిగిపోతోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీన్నే ‘స్లీప్ షేమింగ్’ అంటారు. కష్టపడి పనిచేయడం అంటే నిద్రను త్యాగం చేయడమేనన్న తప్పుడు ఆలోచన వల్ల చాలామంది ఒత్తిడికి గురవుతున్నారన్నారు. అయితే సరిగ్గా నిద్రపోతేనే ఆరోగ్యం, పనిలో వేగం పెరుగుతాయని సూచిస్తున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమంటున్నారు.
News April 16, 2026
కొడుకుల కోసం వెళ్తే తండ్రులతో సినిమాలు లాక్!

బింబిసార డైరెక్టర్ వశిష్ఠ గురించి ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ఆయన స్టోరీ లైన్స్ వారసుల కోసం సిద్ధం చేసుకుంటే వారి తండ్రులు కనెక్ట్ అవుతున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా ఆయన నందమూరి మోక్షజ్ఞ కోసం కథను రెడీ చేసుకొని బాలయ్య దగ్గరకు వెళ్లారు. అయితే మరో లైన్ NBKకి నచ్చడంతో ముందు తనతో సినిమా తీయాలని సూచించారట. అంతకుముందు రామ్ చరణ్ కోసం వెళ్తే చిరుతో ‘విశ్వంభర’ ఓకే అయినట్లు సమాచారం.
News April 16, 2026
తేజస్వీ వ్యాఖ్యలను వక్రీకరించారు: రాంచందర్

MP తేజస్వీ సూర్య చేసిన <<19666843>>వ్యాఖ్యలను<<>> BRS, INC వక్రీకరిస్తున్నాయని TBJP చీఫ్ రాంచందర్ అన్నారు. ‘BJP సర్కార్ ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలను ఎలాంటి వివాదాలు లేకుండా ఏర్పాటు చేసింది. కానీ APని కాంగ్రెస్ బాధ్యతారహితంగా విభజించింది. దీని వల్ల చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. TG ఏర్పాటుకు BJP మొదటి నుంచీ మద్దతుగా ఉంది. INC ఏళ్ల తరబడి ఆలస్యం చేయడంతో ఎంతో మంది ప్రాణాలు పోయాయి’ అని ట్వీట్ చేశారు.


