News February 13, 2026

కామారెడ్డి: పరాజయం పాలైన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు

image

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 31వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ ఘోర పరాజయం పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి అజీజ్ హుస్సేన్, ఇండిపెండెంట్ అభ్యర్థి సత్య ప్రకాశ్‌పై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పాక జ్ఞానేశ్వరి మూడో స్థానంలో నిలిచారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహంలో ఉన్నారు.

Similar News

News April 15, 2026

తెలంగాణ స్క్వాష్ జట్టు కోచ్‌గా నిజామాబాద్ వాసి

image

నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన బీ.దీపక్ కుమార్ ఈ నెల ఏప్రిల్ 16 – 22 వరకు న్యూ ఢిల్లీలో జరిగే 69వ జాతీయ స్థాయి స్క్వాష్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని పీడీ రాము తెలిపారు. జిల్లా యువకుడు ఈ ఎంపిక పట్ల యానంపల్లి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

News April 15, 2026

AP, TGలో ఎన్ని లోక్‌సభ స్థానాలు పెరుగుతాయ్?

image

లోక్‌సభ స్థానాల పునర్విభజనతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రం మారనుంది. మొత్తం సీట్లు 850కి (54.54%) పెరిగితే.. ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా ఏపీలో 14, తెలంగాణలో 9 సీట్లు కలవనున్నాయి. అంటే ఏపీలో మొత్తం ఎంపీ సీట్లు 39కి, తెలంగాణలో 26కి చేరతాయి. ఒకవేళ పెంపు 50%కే పరిమితమైతే APలో 13 సీట్లు మాత్రమే పెరుగుతాయి. దక్షిణాదిలో 50% అయితే 65 సీట్లు, 54.54% అయితే 71 స్థానాలు పెరుగుతాయి.

News April 15, 2026

ADB: పల్లెకు చేరువయ్యేనా ‘ప్రగతి చక్రం’?

image

జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పల్లెవాసులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ‘మహాలక్ష్మి’ పథకంతో బస్సులకు రద్దీ పెరిగినా, తిర్యాణి, నార్నూర్, బజార్‌హత్నూర్, భీంపూర్ వంటి మారుమూల మండలాల్లోని గిరిజన గూడాలకు నేటికీ ఆర్టీసీ సౌకర్యం కలగానే మిగిలింది. వర్షాకాలంలో వాగులు పొంగి రవాణా నిలిచిపోతుండటంతో విద్యార్థులు, రోగులు అల్లాడుతున్నారు. అన్ని కాలాల్లో బస్సు నడపాలని కోరుతున్నారు.