News February 13, 2026
1,782 మంది సిబ్బందితో బందోబస్తు: నంద్యాల ఎస్పీ

శ్రీశైలం క్షేత్రంలో 1,782 మంది సిబ్బందితో బ్రహ్మోత్సవాల ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. నంద్యాలలో ఏఎస్పీ, డీఎస్పీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏఎస్పీలు 11 మంది, డీఎస్పీలు 24, సీఐలు 78, ఎస్సైలు 132, ఏఎస్ఐ-హెచ్‌సీలు 303, పీసీలు 568, ఉమెన్ పీసీలు 88, హోంగార్డులు 386, ఉమెన్ హోంగార్డ్స్ 30 మందితో పాటు ఏఆర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
Similar News
News April 18, 2026
ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు

హార్ముజ్‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు ఇండియన్ నౌకలపై IRGC కాల్పులు <<19684352>>జరపడాన్ని<<>> భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నాయి. కాగా దాడులకు గురైన నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
News April 18, 2026
MGU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్ ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2,4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్స్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.
News April 18, 2026
మెదక్: ఎల్లుండి నుంచి సంక్షేమ వారోత్సవాలు..!

TGలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహించాలని GOVT నిర్ణయించింది. ఈ మేరకు CS కె.రామకృష్ణారావు శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ఆదేశాలు జారీ చేశారు. APR 20న శుభ్రత, 21న టాలెంట్ ఫెస్ట్, 22న మౌలిక సదుపాయాలు, 23న పేరెంట్స్ మీటింగ్, 24న నైపుణ్యాభివృద్ధి, 25న సమ్మర్ క్యాంపులు, 26న బడి బాట ఉంటుందన్నారు.


