News February 13, 2026
జెన్ జీ లవ్ స్టోరీల్లో ‘ఆరెంజ్’ ఫ్లేవర్!

నేటి సోషల్ మీడియా యుగంలో ప్రేమలు ‘ఇన్‌స్టంట్’ అయిపోయాయి. జెన్ జీల పోకడతో బంధాలు కలకాలం ఉండటం కలగా మారుతోంది. ప్రతి వాలంటైన్స్ డేకి ఓ కొత్త జంట పుట్టుకొస్తోంది. కానీ ఆ ప్రేమ మొక్కగా ఎదిగేలోపే మనస్పర్ధల తుఫానుకు రాలిపోతోంది. ‘ప్రేమ అంటే కొన్నాళ్లే బాగుంటుంది’ అనే ‘ఆరెంజ్’ సినిమా సిద్ధాంతాన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. ఈ ‘షార్ట్ టర్మ్’ రిలేషన్‌షిప్ వల్ల పాతకాలపు శాశ్వత అనుబంధాలు కనుమరుగవుతున్నాయి.
Similar News
News April 16, 2026
బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>
News April 16, 2026
ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)
News April 16, 2026
IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.


