News February 13, 2026
కాంగ్రెస్ ప్రజా పాలనకు పట్టం కట్టారు: పొంగులేటి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయం రెండేళ్ల ప్రజా పాలనకు నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సీఎం సారథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని హర్షం వ్యక్తం చేశారు. ‘ఎన్నికలు ఏదైనా.. గెలుపు హస్తానిదే’ అని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ, పట్టణాల అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
రామాయణ ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుంది: యశ్

‘రామాయణ’ VFXపై విమర్శలు వస్తున్న వేళ యశ్ కామెంట్స్ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి పనిచేస్తున్నది ప్రతిష్ఠాత్మక DNEG కంపెనీ అని, ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుందని అన్నారు. గ్రాఫిక్స్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. కాగా DNEG డ్యూన్-2, టెనెట్, ఇంటర్‌స్టెల్లార్ వంటి బ్లాక్‌బస్టర్లకు గ్రాఫిక్స్ అందించింది. ఈ నేపథ్యంలో సినిమా ఔట్‌పుట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
News April 16, 2026
ఏపీలో 38, తెలంగాణలో 26 సీట్లకు పెంపు: షా

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా LSలో విమర్శించారు. ‘అందులో ఏ మాత్రం నిజం లేదు. దక్షిణాదిలో జనాభా రేషియో కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయి. ఏపీలో సీట్లు 25 నుంచి 38, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయి. కర్ణాటక, తమిళనాడులోనూ అంతే. ఇది నా గ్యారంటీ. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని స్పష్టం చేశారు.
News April 16, 2026
రూ. 74.2 కోట్లతో కాలువలు, రోడ్ల అభివృద్ధి: కలెక్టర్

ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మరమ్మతులు, ఆధునీకరణ, రావులపాలెం-బొబ్బర్లంక రహదారి విస్తరణ పనుల కోసం ప్రభుత్వం ₹74.2 కోట్లు కేటాయించింది. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించాయి. ప్రస్తుతం డిజైన్ ప్రతిపాదనలు చీఫ్ ఇంజినీర్ పరిశీలనలో ఉన్నాయని, అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు.


