News February 13, 2026

అనకాపల్లి: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

image

చోడవరం(M) లక్కవరం గ్రామానికి చెందిన బొడ్డు సురేంద్ర(24) అనే యువకుడు గురువారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని SI నాగకార్తీక్ శుక్రవారం తెలిపారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నామని పోలీసులు తెలిపారు. సురేంద్రకు ఏడాది క్రితమే వివాహం కాగా.. ప్రస్తుతం అతని భార్య ఎనిమిది నెలల గర్భవతి.

Similar News

News April 16, 2026

TU: ఇంటిగ్రేటెడ్ పదో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) పదో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. 14 మంది విద్యార్థులకు 13 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News April 16, 2026

విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడిన కామారెడ్డి కలెక్టర్

image

కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియం పక్కన నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం పరిశీలించారు. పనుల నాణ్యతను తనిఖీ చేశారు. గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కబడ్డీ సమ్మర్ కోచింగ్ క్యాంపును సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఆడి వారిని ఉత్సాహపరిచారు. స్టేడియంలో బ్యాడ్మింటన్, రైఫిల్ షూటింగ్ వంటి ఆధునిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 16, 2026

భార్యాభర్తల బంధం.. 5-5-5 రూల్‌తో పదిలం!

image

భార్యాభర్తలు గొడవలను దురుసుగా కాకుండా 5-5-5 రూల్‌తో పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాలు భార్య మాట్లాడితే ఆ తర్వాత ఐదు నిమిషాలు భర్త మాట్లాడాలి.. మిగతా 5 నిమిషాలు పరిష్కారానికి కేటాయించాలనేది ఈ కాన్సెప్ట్. మొదటి పది నిమిషాల్లో ఒకరి మాటలను మరొకరు శ్రద్ధగా వినాలి. మధ్యలో కలగజేసుకోకూడదు. దీంతో పాటు రోజూ అభినందించుకోవడం, సాయపడటం వంటివి చేస్తే అనురాగం పెరిగి బంధం బలంగా ఉంటుంది.