News February 13, 2026

క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీపై లోక్‌సభలో ఎంపీ ప్రశ్న

image

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటు, మార్గదర్శకాలు, రోగుల అర్హత ప్రమాణాలపై కేంద్ర ఆరోగ్య శాఖను వివరణ కోరారు. కేంద్ర సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ.. అవసరమైన సదుపాయాలు ఉన్న ప్రభుత్వ తృతీయ శ్రేణి ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందని వెల్లడించారు‌.

Similar News

News April 19, 2026

దువ్వాడ-నిడదవోలు మధ్య 3, 4 రైల్వే లైన్లకు ఆమోదం

image

ప్రధాని మోదీ నేతృత్వంలో నిడదవోలు-దువ్వాడ మధ్య 3, 4వ రైల్వే లైన్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. 198 కి.మీ.ల ప్రాజెక్ట్‌కు రూ.9,889 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం 130% ట్రాఫిక్‌తో రద్దీగా ఉన్న ఈ మార్గంలో కొత్త లైన్లతో రైల్వే ప్రయాణ సమయం తగ్గనుంది. గోదావరి నదిపై 4.3 కి.మీ.ల రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కీలకం. విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్ కనెక్టివిటీ పెరిగి, సరకు రవాణా వేగవంతం కానుంది.

News April 19, 2026

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో దినుసుల ధరలు

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠం ₹13,100, కనిష్ఠం ₹9,200, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం ₹11,500, కనిష్ఠం ₹9,055, మక్కలు గరిష్ఠం ₹1,950, కనిష్ఠం ₹1,765, కందులు ₹6,866, నువ్వులు ₹9,155, సోయాబీన్ ₹3,559, పొద్దుతిరుగుడు ₹3,059, జొన్నలు ₹4,559, శనగలు ₹4,200, వరి (1010) గరిష్ఠం ₹1,785, కనిష్ఠం ₹1,752, అనుములు ₹4,352గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

News April 19, 2026

నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్

image

నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్ నియమితులయ్యారు. వరంగల్ ఏసీపీగా ఉన్న శుభం ప్రకాశ్‌‌ను అడిషనల్ ఎస్పీగా నిజామాబాద్‌కు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని వార్ధా జిల్లా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.