News February 13, 2026

HYD: BEWARE OF రొమాన్స్ స్కామ్స్.. జాగ్రత్త బ్రో!

image

వాలంటైన్స్ డే ఆఫర్లంటూ వచ్చే లింకులు నొక్కారో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. గతేడాది మన రాష్ట్రంలో రొమాన్స్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ద్వారా ఏకంగా ₹12.65 కోట్లు కొల్లగొట్టారు. గిఫ్టులు, ఫ్లవర్ డెలివరీల పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. గుర్తుతెలియని వ్యక్తులకు ఫొటోలు, ఓటీపీలు షేర్ చేయొద్దు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయండని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. బీ అలర్ట్ బాసూ!

Similar News

News February 16, 2026

శివరాత్రి జాగరణ.. ఇవాళ ఏం చేయాలంటే?

image

శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తులు ఇవాళ ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలని చెబుతున్నారు. నిన్న ఉపవాసం, జాగరణ చేసిన వారంతా ఇవాళ రాత్రి అయ్యే వరకూ నిద్రపోకూడదని, అలా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుందని అంటున్నారు.

News February 16, 2026

28,740 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే ఆఖరు

image

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు 5PM వరకు అప్లై చేసేందుకు అవకాశం ఉంది. APలో 1,060, TGలో 608 పోస్టులు ఉన్నాయి. టెన్త్ పాసై, 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ ఉండదు. పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా శాలరీ ఉంది.
సైట్: https://indiapostgdsonline.gov.in/

News February 16, 2026

NGKL: నల్లమలలో సేవాలాల్ పుణ్యక్షేత్రం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

image

నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అద్భుత క్షేత్రాన్ని నిర్మించి, వచ్చే ఏడాది జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహిస్తామన్నారు. ఈ నిర్ణయంపై జిల్లా గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.