News February 13, 2026
చిత్తూరు: నీటి ఎద్దడి సమరం..అధికార యంత్రాంగం సన్నద్ధమా?

వేసవి ప్రారంభం కాకముందు ఎండలు మండుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం సగటు భూగర్భ నీటి మట్టం 8.04 మీటర్లు ఉండగా, గతేడాది 8.94 మీటర్లు ఉండేది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో, పలమనేరు, బైరెడ్డి మండలాల్లోని అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఎదుర్కొనే ప్రాంతాలపై RWS అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Similar News
News April 18, 2026
కుప్పంలో మరో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

గుడిపల్లి (M) కుప్పిగాని పల్లి, దాసిమానిపల్లి, అంగనామాల కొత్తూరు గ్రామాల పరిధిలో 105 ఎకరాల భూమిని NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. రూ.2550 కోట్ల పెట్టుబడితో కాథోడ్ మెటీరియల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పాలసీ (2025-30) కింద ఆమోదించింది
News April 18, 2026
చిత్తూరు: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం 6 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గంగవరంలో 41.2, రొంపిచెర్లలో 41.1, శ్రీరంగరాజపురంలో 40.1, తవణంపల్లెలో 40.9, విజయపురంలో 40.5, బంగారుపాళ్యంలో 40.0, నగరి, నిండ్రలో 39.8, పులిచెర్ల, శాంతిపురంలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.
News April 17, 2026
బాల, బాలికలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించండి: కలెక్టర్

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘బడి పిలుస్తోంది’ ప్రత్యేక ప్రవేశోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈనెల 17 నుంచి 23 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్హత గల బాల, బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. స్లమ్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


