News February 13, 2026

మున్సిపాలిటీలపై ‘హస్తం’

image

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది.
➤ మున్సిపాలిటీలు..
* కాంగ్రెస్ – 64
* బీఆర్ఎస్ – 15
* హంగ్ – 36
* ఇతరులు – 1, * బీజేపీ – 0
➤ వార్డులు * కాంగ్రెస్ – 1346, బీఆర్ఎస్ – 723, బీజేపీ – 261, ఇతరులు – 252

Similar News

News February 19, 2026

పాక్‌పై విమర్శలు.. హాకీ కెప్టెన్‌పై వేటు

image

ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ యాజమాన్యం తమను పట్టించుకోలేదని <<19176695>>విమర్శలు<<>> గుప్పించిన పాక్ హాకీ కెప్టెన్ అమ్మాద్ షకీల్ భట్‌పై వేటు పడింది. పాక్ హాకీ ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేసినందుకు రెండేళ్ల పాటు సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాలో బసకు ఏర్పాట్లు లేక రోడ్లపైనే గంటలకొద్దీ తిరిగామని, సొంత ఖర్చులతోనే మేనేజ్ చేసుకున్నట్లు భట్ చెప్పడం చర్చనీయాంశమైంది.

News February 19, 2026

₹5 స్నాక్ ప్యాకెట్ల హవా.. ₹లక్షల కోట్ల మార్కెట్!

image

₹5 లేదా ₹10 ప్యాకెట్లు దేశంలో స్నాక్ మార్కెట్ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చవక ధరలు కంపెనీలకు ప్లస్ అయింది. 2027కి ఈ మార్కెట్ విలువ ₹1,21,700కోట్లకు చేరనుందని పారిశ్రామిక వర్గాల అంచనా. చిప్స్, వేఫర్ల వాటా 57%, నమ్‌కీన్స్ వంటి దేశీయ స్నాక్స్ వాటా 43%గా ఉంది. దేశీయ స్నాక్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత స్నాక్ మార్కెట్‌లో పెట్టుబడికి విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

News February 19, 2026

T20WC.. శ్రీలంకపై జింబాబ్వే సంచలన విజయం

image

T20WCలో మరో సంచలనం నమోదైంది. ఇటీవల ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే ఇవాళ శ్రీలంకను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత లంక 20 ఓవర్లలో 178/7 రన్స్ చేసింది. అనంతరం జింబాబ్వే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ బెన్నెట్ (63*), సికిందర్ రజా 45 పరుగులతో తమ జట్టును గెలిపించారు. ఇప్పటికే జింబాబ్వే సూపర్-8లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.