News February 13, 2026
జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్

జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. 5 మున్సిపాలిటీల కౌంటింగ్ కోసం 46 టేబుల్స్, 46మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 135 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 46 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి మొత్తంగా 3 రౌండ్లలో కౌంటింగ్ ను సాయంత్రం 6 గంటల్లోపు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 18, 2026
VZM: పైడితల్లమ్మ ఆలయం పనులు.. ఉత్తరాయణలోనే ప్రారంభించేలా చర్యలు

విజయనగరం పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News April 18, 2026
యువిన్ తల్లి స్వప్నకు దేవాదాయ శాఖలో ఉద్యోగం

మేడారంలో రాతి కట్టడం కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి కాలును కోల్పోయిన బాలుడు యువిన్ తల్లి స్వప్నకు దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఆమెకు ములుగు కలెక్టరేట్‌లో నియామక పత్రం అందజేశారు. బాలుడి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని, వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ కళ్యాణి పాల్గొన్నారు.
News April 18, 2026
బాపట్ల: యాక్సిడెంట్.. ఇద్దరి స్పాట్ డెడ్ మృతి

కారంచేడు మండలం స్వర్ణ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. దగ్గుబాడు నుంచి స్వర్ణ వైపు వస్తున్న ఆటో, స్వర్ణ నుంచి దగ్గుబాటి వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై పయనిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


