News May 1, 2024

బొబ్బిలిలో సీఎం సభ.. రక్షణ కల్పించాలని ఫిర్యాదు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం జగన్ బొబ్బిలిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట బొబ్బిలి మొయిన్ రోడ్డులో సభ పెట్టేందుకు సన్నాహాలు చేయగా.. బొబ్బిలి కోట ఉత్తర ద్వారం ఎదురుగా సభ పెట్టేందుకు మంగళవారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. కూటమి అభ్యర్థి బేబినాయన ఇంటికి సమీపంలో సభ నిర్వహించడంపట్ల అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది గంట శర్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News March 3, 2026

డెంకాడ: జనగణన-2027 తొలి దశ శిక్షణ ప్రారంభం

image

జనగణన-2027 తొలి దశ ‘గృహాల జాబితా’ శిక్షణను జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ డెంకాడలోని చింతలవలస MVGR కాలేజీలో మంగళవారం ప్రారంభించారు. అధికారులు డిజిటల్ యాప్ ద్వారా ఖచ్చితమైన డేటా సేకరణ చేసి, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.

News March 3, 2026

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

విజయనగరంలోని వైష్ణవ వీధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నాయుడు ప్రసాద్ (43) సోమవారం తన సోదరితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో SI కమల్ భార్గవ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News March 3, 2026

VZM: ఇంట్లోవారిని బెదిరిద్దామని గడ్డిమందు తాగిన వ్యక్తి..

image

విజయనగరం (D) రేగిడి మండలం బూరాడకి చెందిన జగ్గునాయుడు కొంత కాలంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు చెప్పడంతో వారిని బెదిరించేందుకు ఆదివారం సాయంత్రం తాగిన మైకంలో ఇంటి సమీపంలో గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న జగ్గునాయుడిని కుటుంబీకులు రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.