News February 14, 2026

పెద్దపల్లిలో నోటా ఓట్లు ఎన్నంటే..?

image

పెద్దపల్లి మునిసిపల్ పరిధిలోని 36 వార్డులలో పలువురు అభ్యర్థులు తమ ఓటును నోటా గుర్తుపై వేశారు. మొత్తం 32,201 ఓట్లు పోలవగా, 77 మంది నోటాకు ఓటు వేసి అభ్యర్థులపై తమకు గల అయిష్టతను వెలిబుచ్చారు. అలాగే అన్ని వార్డులలో కలిపి 288 చెల్లని ఓట్లు పడినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా 36వ వార్డులో 20 ఓట్లు చెల్లకుండా పోయాయి.

Similar News

News April 17, 2026

ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

image

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.

News April 17, 2026

తిరుచానూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు

image

తిరుచానూరులో కొత్త సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పనిభారం, ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో రేణిగుంట, తిరుపతి రూరల్ కార్యాలయాల పరిధిని విభజించి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేణిగుంట నుంచి 3, తిరుపతి రూరల్ నుంచి 19 గ్రామాలను కొత్త కార్యాలయ పరిధిలోకి తీసుకువస్తారు. దీంతో సేవలవేగం, పారదర్శకత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

News April 17, 2026

పల్నాడు జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

image

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం 12,67,982 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 6,23,010 మంది ఉండగా, మహిళలు 6,44,897 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 75 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.