News February 14, 2026
కరీంనగర్: ఆ ఘటనకు 12 ఏళ్లు..!

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 12 ఏళ్లు పూర్తయింది. 2014 ఫిబ్రవరి 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధనకు KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
Similar News
News April 17, 2026
మెదక్ జిల్లాకు రెండు డయాలసిస్ కేంద్రాలు

రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 59 ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుండగా.. మెదక్ జిల్లాలోని రామాయంపేట, కౌడిపల్లి కేంద్రాలకు అనుమతులు లభించాయి. త్వరలోనే ఐదు పడకల సామర్థ్యంతో ఈ కేంద్రం అందుబాటులోకి రానుంది. దీంతో కిడ్నీ బాధితులకు స్థానికంగానే ఉచితంగా డయాలసిస్ సేవలు అందనున్నాయి.
News April 17, 2026
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కలెక్టర్ నిషాంతి

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అల్లూరి జిల్లా కలెక్టర్ నిషాంతి అన్నారు. ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శుక్రవారం పాడేరులో రైజింగ్ స్టార్స్ పేరుతో సత్కారించి బహుమతులు అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ కళాశాలల నుంచి ఏడుగురు, KGBV.ల నుంచి నలుగురు, ప్రభుత్వం జూనియర్ కళాశాలల నుంచి నలుగురికి ఈ సత్కారం లభించింది. పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2026
మెదక్: కార్మికుల కొత్త వేతన ఒప్పందం ఖరారు: CITU

సీఐటీయూ చొరవ, కార్మికుల ఐక్యతతోనే మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందంపై శుక్రవారం సంగారెడ్డి లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంతకాలు పూర్తయ్యాయి. పాత ఒప్పందం మార్చి 31తో ముగియగా, కొత్త ఒప్పందం ద్వారా కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.


