News February 14, 2026
కామారెడ్డి: KTR స్పీచ్‌లు అదిరినా.. ఓట్లు రాలేదు!

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించినప్పటికీ, ఆ ప్రభావం ఫలితాల్లో ఆశించిన స్థాయిలో కనిపించ లేదు. స్టార్ క్యాంపెయినర్ పర్యటించిన చోట్ల పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Similar News
News April 18, 2026
HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందగా.. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.
News April 18, 2026
నెల్లూరు: బాలికపై రేప్.. పదేళ్లు జైలు శిక్ష

నెల్లూరు రూరల్ కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య(45) తన పిల్లలకు పెళ్లిళ్లు చేసి, తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. అక్క కుమార్తె(16)ని 2021లో బంధువుల ఇంటికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వివాహం చేసుకొని అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
News April 18, 2026
HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందింది. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.


