News May 1, 2024
ఏలూరు: యువతిపై ఇద్దరి అత్యాచారం

ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఏలూరులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..ఏలూరు నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన యువతికి తంగెళ్లమూడికి చెందిన కాకిశ్యామ్, నక్కా ఏసురత్నం మాయమాటలు చెప్పి నగరశివారులో అద్దెకు తీసుకున్న గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో దిశ CI విశ్వం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులతో పాటు వారికి సహకరించిన షేక్ అఖిల్ బాషాను అరెస్ట్ చేశారు.
Similar News
News March 13, 2026
పర్యాటకాభివృద్ధిపై దృష్టి: కలెక్టర్

సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ సి.నాగరాణి పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధిపై చర్చ సందర్భంగా.. జిల్లాలో ప్రభుత్వ భూముల కొరతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హోటళ్ల నిర్మాణానికి అనువుగా రెండు చోట్ల ఆర్‌అండ్‌బీ స్థలాలను గుర్తించి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఆమె ఈ సమావేశంలో వివరించారు.
News March 12, 2026
ప.గో: డ్రోన్ల వినియోగం భేష్.. కలెక్టర్‌కు సీఎం ప్రశంస

కలెక్టర్ల సమావేశంలో ప.గో కలెక్టర్ నాగరాణి పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. జిల్లాలో 45 డ్రోన్లను వ్యవసాయ సాగుతో పాటు, విద్యుత్తు లైన్ల నిర్మాణంలో పోల్ టు పోల్ వైర్లను అమర్చేందుకు ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. దీనివల్ల తక్కువ సమయంలో పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. ఈ వినూత్న ప్రయోగాన్ని గతంలో ఎన్నడూ వినలేదని పేర్కొంటూ సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
News March 12, 2026
భీమవరం: హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం

ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారి గిరిధర్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ సదుపాయం ఎంతో దోహదపడనుంది.


